హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రశ్నించే గొంతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నది. తాజాగా ప్రముఖ సామాజిక మాధ్యమం తెలుగు స్క్రైబ్ రిపోర్టర్ గౌతమ్‌ను (Gowtham) పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రతినిత్యం ప్రశ్నిస్తున్నందునే తెలుగు స్క్రైబ్‌ను టార్గెట్ చేసి గౌతమ్‌ను దౌర్జన్యంగా అరెస్టు చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వేళ అరెస్టు చేయాల్సినంత తప్పు ఆయనేమీ చేయలేదనీ, తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారిని భయపెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను వాడుకుంటున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ సి.కళ్యాణ్ రావు ఆరోపించారు. గౌతమ్ విడుదలకు న్యాయపరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.