T-Hub | ఆవిష్కరణల విధానం, అంకుర సంస్థలకు అందించిన ప్రోత్సాహకాలతో అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థలకు తెలంగాణ రాష్ట్రం ఆలవాలమైంది. పారిశ్రామిక వృద్ధికి నూతన ఆవిష్కరణరణలు, సాంకేతిక విజ్ఞానం ప్రధాన కారకాలు. వినూత్న విధానాల ద్వారా పారిశ్రామిక రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నది. ఫలితంగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
రాయితీలు, ప్రోత్సాహకాలతో స్టార్టప్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఏటా అనేక మంది ఔత్సాహికులు ‘టీహబ్’ సహకారంతో తమ ప్రతిభ దేశ ప్రగతికి ఉపయోగపడేలా కృషి చేస్తున్నారు. వాటిలో కొన్ని జాతీయ ప్రాముఖ్యతను పొందాయి. డార్విన్ బాక్స్ అనే అంకుర సంస్థ తెలంగాణ నుండి యూనికార్న్ క్లబ్లో చేరిన మొదటి అంకుర సంస్థ. టీ-హబ్లో పొదిగిన సై రూట్ ఏరోస్పేస్ అనే మరో అంకుర సంస్థ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ‘ప్రారంభ్’ను అభివృద్ధి చేసి విశిష్ట హోదాను పొందింది. తెలంగాణలో అంకుర సంస్థల వృద్ధికి తోడ్పాటు అందించేందుకు డీపీఐఐటీ, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022లో టీ-హబ్ ‘భారతదేశంలో ఉత్తమ ఇంక్యుబేటర్’ అవార్డును కైవసం చేసుకున్నది.
టీ-హబ్ (టీ-హబ్ 2.0) రెండవ దశ 2022 జూన్ 28న ప్రారంభమైంది. ఇది 4,000 అంకుర సంస్థల ఆవిష్కరణరణ, పర్యావరణ వ్యవస్థ ఇతర కీలక అంశాలను కలిగి ఉండే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణరణ శిబిరాల్లో ఒకటి. ప్రభుత్వం చొరవ వల్ల 2022-23లో (జనవరి 2023 వరకు) రూ.20,237 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2,518 కొత్త పరిశ్రమలు ఏర్పాటవ డంతో 72,908 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుతం, రాష్ట్రంలో 78 ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, కో-వరింగ్ స్పేస్లు ఉన్నాయి. ఇవి లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రి టెక్, డిజిటల్ మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి సారించాయి.
తెలంగాణలో సేవల రంగం 2022-23లో ప్రస్తుత ధరల ప్రకారం 17.5% వృద్ధిని సాధించింది. 2020-21లో కొవిడ్ సమయంలో సేవల రంగం బాగా దెబ్బతినగా, 2022-23లో ఈ రంగం కొవిడ్ ముందున్న జీవీఏ (2019-20) కంటే 41.1% ఎకువగా ఉన్నది. ఇది తెలంగాణలో ఉత్పత్తి అయ్యే సేవల డిమాండ్లో బలమైన పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తున్నది. తాతాలిక ముందస్తు అంచనాల ఆధారంగా, 2022-23లో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర జీఎస్వీఏలో ఈ రంగం 62.8% వాటాలు కలిగి ఉన్నది.
… భరద్వాజ