సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే.. తెలంగాణ విద్వత్సభ వివరణ ఇదీ..

bathukamma festival | తెలంగాణ రాష్ట్రమంతటా బతుకమ్మ సందడి కనిపిస్తుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాలు అంబరంగా సాగుతున్నాయి. కాకపోతే ఈ ఏడాది సద్దుల బతుకమ్మ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. ఒకే రోజు రెండు తిథులు వస్తుండటంతో సద్దుల బతుకమ్మను ఏ రోజు జరుపుకోవాలన్న విషయంలో ఈసారి అయోమయం తలెత్తింది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్సభ నిర్ణయం మేరకు ఈ నెల 13నే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు బుధవారం సెలవు దినంగా ప్రకటించింది. కానీ ప్రాంతీయంగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సద్దుల బతుకమ్మపై తెలంగాణ విద్వత్సభ మరోసారి వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

‘బతుకమ్మ అనేది ప్రాంతీయ సంప్రదాయం. ఇది కొన్ని ప్రాంతాల్లో 9 రోజులు, వేములవాడ, కొండపాక ప్రాంతాల్లో 7 రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో 11 రోజులు, 13 రోజులు ఆడటం సంప్రదాయంగా ఉంది’ అని తెలంగాణ విద్వత్సభ పేర్కొంది. ఈ బతుకమ్మ పండుగను ప్రాంతీయంగా ఆ ప్రాంతంలోని పురోహితులు, పండితులు నిర్ణయించుకోవడం సరియైనదని తమ భావన అని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఆ రోజును సెలవు దినంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలవు దినం ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించేందుకు మాత్రమే దుర్గాష్టమి రోజే బతుకమ్మ పండుగ అని తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిందని పేర్కొంది. కాబట్టి ప్రభుత్వ పరంగా 13వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారని చెప్పింది. ప్రాంతీయంగా వారి వారి సంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగను జరుపుకోవచ్చని వివరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bathukamma songs | ఈ బతుకమ్మ పాటలు మీరు విన్నారా?
Bathukamma festival | బతుకమ్మ పండుగను ఎనకట ఎట్ల జరుపుకునేటోళ్లం..
వాడ వాడంత ఉయ్యాలో.. పూల వనమాయే ఉయ్యాలో..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

