నయీంనగర్, ఆగస్టు 27: టీఎస్ఐసెట్ ఫలితాల్లో 89.58 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఐసెట్ ఫలితాలను శనివారం కాకతీయ వర్సిటీలో ఐసెట్ చైర్మన్, వీసీ రమేశ్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 1వ ర్యాంకు దంతాల పూజిత్వర్ధన్ (గోరంట్ల, గుంటూరు, ఏపీ), 2వ ర్యాంకు అంబవరం ఉమేశ్ చంద్రరెడ్డి (ముతరాసపల్లి, కడప, ఏపీ) 3వ ర్యాంకు కాట్రగడ్డ జితిన్సాయి (రేపల్లె, గుంటూరు), 4వ ర్యాంకు ఎలిశాల కార్తీక్ (కేసముద్రం, మహబూబాబాద్, తెలంగాణ), 5వ ర్యాంకు ధర్మాజీ సతీశ్కుమారు (హాజిపూర్, మంచిర్యాల, తెలంగాణ),
6వ ర్యాంకు మైలవరపు అభినవ్ (బొందలగడ్డ, హైదరాబాద్), 7వ ర్యాంకు నవనీస కంపరాజు (కాచిగూడ, హైదరాబాద్), 8వ ర్యాంకు ఎజ్జగిరి హరిప్రసాద్ (శివనగర్, వరంగల్), 9వ ర్యాంకు నారాల మనీషారెడ్డి (కామారెడ్డి), 10వ ర్యాంకు తిరువీది సువర్ణ సాత్విక( జంగారెడ్డిగూడెం, ఏపీ) సాధించారు. బాలురు 33,855, బాలికలు 34,922, ట్రాన్స్జెండర్లు నలుగురు పరీక్ష రాశారని తెలిపారు. వీరిలో 30,409 బాలురు, 31,201బాలికలు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఉత్తీర్ణత (మొత్తం 89.58 శాతం) సాధించారని వెల్లడించారు.