హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2025 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు.
ఉదయం 9 నుంచి 11:30గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 9 రోజుల్లో 16 సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు.