మహిళా న్యాయవాదుల సమాఖ్య కార్యవర్గ ఎన్నిక

హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల సమాఖ్య నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. హైకోర్టు ఆవరణలో ఆదివారం జరిగిన మహిళా న్యాయవాదుల సమావేశంలో అధ్యక్షురాలిగా పీ రేవతిదేవి, కార్యదర్శిగా శాంతి నీలం ఎన్నికయ్యారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు సుమాలినిరెడ్డి, కార్యదర్శి జయారెడ్డి నుంచి వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రేవతిదేవి ప్రసంగిస్తూ, తమ సమాఖ్య, మహిళా న్యాయవాదుల సంక్షే మం కోసమే కాకుండా వివిధ రీతుల్లో వేధింపులకు గురౌతున్న మహిళలు, పేద మహిళలకు న్యాయపరమైన చేయూతను ఇస్తున్నదని చెప్పారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షురాలు రేవతిదేవి. కార్యదర్శులు శాంతి నీలం, టీసీ సుజాత (వరంగల్- ప్రాంతీయ), ఉపాధ్యక్షులు డీ మాధవి, జయ ఎస్ రావు (వరంగల్ – ప్రాంతీయ), కోశాధికారి ఎన్ సమీనా, జాయింట్ సెక్రెటరీలుగా పీ సత్య మంజుల, శారద కటకం (రంగారెడ్డి జిల్లా-ప్రాంతీయ) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జాకియా రెహమాన్, పీ జాహ్నవి, జె యాదమ్మ, సఫియా బేగం, వరంగల్ ప్రాంతీయకు కే ఇందిర ఎన్ రావు, కే రత్న మంజుల, మానేపల్లి కవిత, బీ శోభ, ఎన్ సునీత, ఎన్ వసుధ, యు వీణ, కరీంనగర్ – ప్రాంతీయకు నిషా సింగ్ (కరీంనగర్ – ప్రాంతీయ) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ కల్యాణ్రావు అభినందనలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

