హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఇందులో రాష్ట్రంలోని 48,405 మంది వైద్యులు నమోదై ఉన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న మెడికల్ కౌన్సిల్ ఎన్నికల కోసం ఇటీవలే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేస్తామని కౌన్సిల్ చైర్మన్ రాజలింగం తెలిపారు.