హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సుస్థిర, సమగ్ర, వాతావరణ రక్షణ(ైక్లెమెట్ రెసిలియంట్) భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా పట్టణాలను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ నివాసాల కార్యక్రమం మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లోని ఎన్ఐయూఎంలో గురువారం జరిగిన ఈ ఒప్పందంపై పురపాలకశాఖ కార్యదర్శి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) డైరెక్టర్ జనరల్ టీకే శ్రీదేవి, యూఎన్-హాబిటాట్ రీజినల్ ప్రోగ్రామ్స్ డివిజన్ డైరెక్టర్ పాట్రిక్ కెనగాసింగమ్ సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆశయాలకు అనుగుణంగా పట్టణ సంస్థలను మరింత బలోపేతం చేయడంతోపాటు వేగవంతమైన పట్టణీకరణ సవాళ్లను సమర్థంగా ఎదురొనేలా నగరాలను సిద్ధం చేయడమే ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో యూఎన్-హాబిటాట్ ప్రతినిధులు శుభగతోదాస్ గుప్తా, అలైన్ మచాడో డా మట్టా, నిలేశ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.