e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home తెలంగాణ పెరుగుతున్న క్యూఆర్‌ కోడ్‌ ఫిర్యాదులు

పెరుగుతున్న క్యూఆర్‌ కోడ్‌ ఫిర్యాదులు

  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 86 కంప్లయింట్స్‌
  • కొత్త విధానంపై మహిళా భద్రత విభాగం విస్తృత ప్రచారం
పెరుగుతున్న క్యూఆర్‌ కోడ్‌ ఫిర్యాదులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22, (నమస్తే తెలంగాణ): గృహ హింస, సోషల్‌ మీడి యా వేధింపులు, మానవఅక్రమ రవా ణా, ఆకతాయిల అల్లరి.. ఇలా సమస్య ఏదైనా మహిళల పాలిట అందివచ్చిన వరంగా మారింది క్యూఆర్‌ కోడ్‌ ఫిర్యా దు విధానం. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు క్యూఆర్‌కోడ్‌ ద్వా రా ఫిర్యాదు చేసే విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ విధానంపై మహిళల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్‌ కోడ్‌ విధానంలో 86 ఫిర్యాదులు అందినట్టు మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 49 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఎక్కువ ఫిర్యాదులు లైంగిక వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయని అధికారులు పేర్కొన్నారు.

విస్తృతంగా అవగాహన
మహిళా భద్రత విభాగం ఇంచార్జి, అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఆధ్వర్యంలో క్యూఆర్‌ కోడ్‌తో ఫిర్యాదు విధానానికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. మెట్రో స్టేషన్లు, బస్‌స్టాండ్లు, బస్సులు, రైళ్లు, ఆటోలపై, క్యాబ్స్‌లో, రద్దీ ప్రదేశాల్లో ఎక్కడ వీలైతే అక్కడ ఈ క్యూఆర్‌ కోడ్‌ ఫిర్యాదు పోస్టర్లను ఏర్పాటుచేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకునేలా పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పోస్టర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే ఒక ఫిర్యాదు పేజీ వస్తుంది. అందులో వివరాలు పొందుపర్చగానే అది షీటీమ్స్‌ సర్వర్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి అది ఏ ప్రాంతానికి చెందిన ఫిర్యాదు అయితే ఆ ప్రాంత పోలీస్‌ సిబ్బంది అలర్ట్‌ అవుతారు. వెంటనే రంగంలోకి దిగి బాధితులకు సాయం అందిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెరుగుతున్న క్యూఆర్‌ కోడ్‌ ఫిర్యాదులు

ట్రెండింగ్‌

Advertisement