హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీకి అరుదైన గౌరవం దక్కింది. భారత ఆహార వ్యవసాయ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న‘ ఇండియా-ఆఫ్రికా సమ్మిట్’లో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ ‘విత్తన పరీక్ష-ధ్రువీకరణ ఎక్సలెన్సీ’ అవార్డుకు ఎంపికైంది.
ఉద్యాన పంటల సాగుకు 40% రాయితీ ; ఉద్యానవనశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తోటల విస్తీర్ణం పెంపునకు సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం(ఎంఐడీహెచ్)కింద 2025-26 సంవత్సరానికిగాను మామిడి, అరటి, జామ, బొప్పాయి, డ్రాగన్‌ఫ్రూట్, అవకాడో, బత్తాయి వంటి పండ్ల తోటలకు 40 శాతం రాయితీ కల్పించనున్నట్టు ఉద్యానవనశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.