హైదరాబాద్, ఫిబ్రవరి 3 : కొత్త సచివాలయంలో ఇంటీరియర్ డిజైన్లు తెలంగాణ వైభవానికి ప్రతీకగా ఉండాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సచివాలయ నిర్మాణం, ముఖ్యమంత్రి పేషీ, క్యాబినెట్ హాల్, వీవీఐపీ వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్, రెండు సైలాంజ్లు, అంతర్గత సుందరీకరణ, ఫర్నిచర్ డిజైన్లు ఉండాలని పేర్కొన్నారు. గురువారం ఆయన నూతన సచివాలయ నిర్మాణంపై ఆరిటెక్ట్లు, అధికారులతో ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటుచేసే ఫర్నిచర్, ఇంటీరియర్లకు సంబంధించిన క్లాసికల్, సెమి క్లాసికల్, మోడ్రన్ డిజైన్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ఆరిటెక్ట్లు తయారు చేసిన ఇంటీరియర్, డిజైన్లకు తగిన సూచనలు చేశారు. ఇంటీరియర్స్‌లో ప్యానలింగ్, మౌల్డింగ్, ఫాల్స్ సీలింగ్ పనులు, రంగుల కూర్పునకు సంబంధించిన డిజైన్లను క్లాసికల్, సెమీ క్లాసికల్, మోడ్రన్ ప్యాట్రన్లలో తయారుచేసి సీఎంకు సమర్పించాలని తెలిపారు. సచివాలయ సిబ్బందికి ఏర్పాటుచేసే వరింగ్ స్టేషన్ నమూనాలు, కార్యదర్శుల చాంబర్లు, మంత్రుల చాంబర్లలో ఏర్పాటుచేసే ఫర్నిచర్ నమూనాలను పరిశీలించిన అనంతరం 3 రకాల ఫర్నిచర్లను షార్ట్‌లిస్ట్ చేస్తామని, వాటిని సీఎం కేసీఆర్ పరిశీలించాక తుది నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. అన్ని విభాగాల పనులను సమాంతరంగా ఏకకాలంలో నిర్వహించాలని, సీఎం నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఎస్ఈ సత్యనారాయణ, ఆరిటెక్ట్లు ఆసార్, పొన్ని, షాపూర్జీ వర్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.