హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయలేక ప్రభుత్వ పెద్దలు సమ్మె నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నారా?.. ఈసారి కూడా కార్మిక సంఘాలను విభజించు-పాలిం చు విధానంతో విడగొట్టేందుకు చర్చలు ప్రారంభించారా?.. అంటే అవుననే అంటున్నారు ఆర్టీ సీ కార్మికులు. కార్మిక జేఏసీకి కార్మికుల నుంచి వస్తున్న అనూహ్య మద్దతును నిర్వీర్యం చేసేందుకు, సంఘాలవారీగా కుంపటి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జేఏసీలో లేని పలువురు సంఘాల నేతలను ప్రభుత్వ పెద్దలు రహస్య చర్చలకు పిలుస్తున్నట్టు తెలుస్తున్నది. నిరుడు మే 7న కార్మిక జేఏసీ నేతలు సమ్మె సైర న్ మోగించారు. తీరా సమ్మె నాటికి పార్టీలు, సంఘాల వారీగా ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి సమ్మెను నిర్వీర్యం చేయించారు.
నిరుడు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె చర్చల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ విడతల వారీగా మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జేఏసీలో లేని సంఘాలతో చర్చలు జరిపారు. దీంతో ఆయా సంఘాలు సమ్మెకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాయి. ఆ తర్వాత పథ కం ప్రకారం ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలను ఒక చోటికి పిలిచి.. సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరా వు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్‌తో చర్చ లు పెట్టించారు. అందరినీ సచివాలయంలోని తన చాం బర్లో కూర్చోబెట్టి సమ్మె జరుగకుండా చేశా రు. అప్పుడు కూడా జేఏసీ నేతలకు అలవిగాని హామీలు ఇచ్చారు. దీంతో సమ్మెను వాయిదా వేశారు.
నిరుడు మే 6న సచివాలయంలో జేఏసీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హా మీలు ఒక్కటీ అమలుకు నోచలేదని కార్మికు లు చెప్తున్నారు. ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్ష లు ఎత్తివేసి యూనియన్లను రెస్టోర్ చేస్తూ ఎన్నికలు నిర్వహించాలనే జేఏసీ ప్రతిపాదనకు మంత్రి సుముఖత వ్యక్తంచేసినా నేటికీ స్పష్టత లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చే యాలని కోరగా.. సీఎం దగ్గరకు తీసుకెళ్లి ప రిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి ఏడాదైనా అతీగతి లేదు. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మంత్రి స్పందిస్తూ.. చిన్న చిన్న తప్పిదాలకు చర్యలు లేకుండా చూస్తామని చెప్పినా, చిన్న కారణాలకే సిబ్బందిని తొలగిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి స బ్సిడీపై నేరుగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానిక నోట్ పంపినట్టు చెప్పినా, ఆ దిశగా చర్యలు లేవు. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పినా, నేటికీ ఒక్క భర్తీ చేయలేదు. రిటైర్ అవుతున్న వారికి సెటిల్మెంట్లు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పినా, ఒక్కరికీ డబ్బులే ఇవ్వలేదు. ఇలా నాడు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో కార్మికులు రగిలిపోతున్నారు.