హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల చు ట్టుపకల బహిరంగంగా పనిచేస్తున్న దళారులను గుర్తించి తొలగించాలని, బ్రోకర్లకు నో ఎంట్రీ కచ్చితంగా అమ లు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ జేటీసీ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆర్టీఏ/ఆర్టీవో కార్యాలయాల్లో బ్రోకర్లు/ఏజెంట్ల జోక్యం, స్లాట్ అక్రమ బు కింగ్ దందా, ఆన్లైన్ సేవల్లో సాంకేతిక లోపాల గురించి మీడియాలో కథనాలు రావడంతో తెలంగాణ రవాణాశాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఖైరతాబాద్, మలక్‌పేట, బండ్లగూడ, కొండాపూర్, తిరుమలగిరి తదితర కార్యాలయాల ఆవరణలో ఏజెంట్లను, బ్రోకర్లను రానివ్వొద్దని రవాణాశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్ ఆదేశించారు.
హైదరాబాద్ జోన్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు(డీటీసీలు), జిల్లా రవాణా అధికారులకు (డీటీవోలు) సర్యులర్ జారీ చేశారు. సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఆర్సీ/డీఎల్ దరఖాస్తులను వెంటనే పరిషరించాలన్నారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థలో లోపాలను ఎన్ఐసీ/రాష్ట్ర డాటా సెంటర్‌తో సమన్వయం చేసుకుని సరిదిద్దాలన్నారు. సిబ్బందికి ఆన్లైన్ సేవలపై అ వగాహన కల్పించి, సాంకేతిక కారణాలతో ప్రజలను వెనకి పంపకుండా చూడాలని, బ్రోకర్లతో కుమ్మకైనట్టు తేలిన అధికారులు/సిబ్బందిపై కఠిన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే బ్రోకర్ల జోక్యం, అక్రమ వసూళ్ల గురించి ఎవరైనా గమనిస్తే.. నేరుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి తెలియజేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.