హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తోపాటు అనుబంధ ఆన్లైన్ సేవలు షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు తాతాలికంగా అందుబాటులో ఉండదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సుమారు ఐదేండ్ల్ల తర్వాత సర్వర్ నిర్వహణ పనులు చేపడుతున్నట్టు చెప్పారు.
సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడటం కోసం ఈ తాతాలిక విరామం అవసరమని పేరొన్నారు. జూన్ 26న మొహర్రం, 28న ఆదివారం ప్రభుత్వ సెలవు అని, మధ్యలో ఉన్న జూన్ 27 ఒకరోజు మాత్రమే రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలు రిజిస్ట్రేషన్ పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29 నుంచి అన్నిసేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుబీమా పథకానికి సంబంధించిన మొత్తం ప్రీమియాన్ని ఎల్ఐసీ సంస్థకు చెల్లించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతుబీమా పథకంలో నమోదు చేసుకున్నారని, వీరందరికీ వర్తించేలా ఎల్ఐసీకి వార్షిక ప్రీమియం రూ.1,359.56 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రైతు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకాన్ని అత్యంత బాధ్యతతో అమలు చేస్తున్నామని చెప్పారు.