హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్‌ను అమలుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. 2002, 2003 డీఎస్సీ టీచర్లకు ఓపీఎస్‌ను వర్తింపజేయాలని సర్కారును కోరింది.
ఉద్యోగ సమస్యల పరిష్కారానికి నియమించిన త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్‌ను తపస్ ప్రతినిధి బృందం సోమవారం కలిసి పలు అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించింది. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు తక్షణమే చెల్లించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ కోరారు. పాఠశాల విద్యలో డిటెన్షన్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది.