హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వర్షాకాలం ఇప్పటివరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 22.5%లోటు నమోదైంది. ముఖ్యంగా 20 జిల్లాల్లోని 376 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులపై ప్రభావం చూపుతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం మండలిలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 626.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 485.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1,22,70,185 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి.
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, ఈదురుగాలుల తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఆది లాబాద్, జగిత్యాల జిల్లాల్లో తేలికపా టి వర్షాలు కురుస్తాయని, జోగుళాంబ -గద్వాల, నిర్మల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.