హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : పొగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంలో తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో నిలిచినట్లు సీఐడీ ఇన్చార్జి ఏడీజీ మహేశ్ భగవత్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నుంచి 396 రోజుల్లో 30,049 ఫోన్లు కనుగొని బాధితులకు అప్పగించారని వెల్లడించారు. కాగా 35,945 ఫోన్ల రికవరీలతో కర్ణాటక మొదటిస్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు.