ఏఐపీడీ మీట్లో ఒవరాల్ చాంప్గా తెలంగాణ
లక్నోలో బాబూ జగజ్జీవన్ రామ్ ఆర్పీఎఫ్ అకాడమీలో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ (ఏఐపీడీ) మీట్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 12 నుంచి 16 వరకు జరిగిన ఈ మీట్లో రాష్ట్ర పోలీసులు మొత్తం 5 బంగారు, 7 వెండి పతకాలు కైవసం చేసుకున్నారు.
- 5 గోల్డ్, 7 సిల్వర్ మెడల్స్ కైవసం
- విజేతలకు సీఎం రేవంత్ రెడ్డిఅభినందనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): లక్నోలో బాబూ జగజ్జీవన్ రామ్ ఆర్పీఎఫ్ అకాడమీలో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ (ఏఐపీడీ) మీట్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 12 నుంచి 16 వరకు జరిగిన ఈ మీట్లో రాష్ట్ర పోలీసులు మొత్తం 5 బంగారు, 7 వెండి పతకాలు కైవసం చేసుకున్నారు. తద్వారా 12 ఏండ్ల తర్వాత ఓవరాల్ చాంపియన్గా అవతరించారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఫొటోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్, స్పెషల్ కెనైన్ యూనిట్ కాంటెస్ట్, యాంటీ శాబోటేజ్ చెక్స్, పోలీస్ వీడియోగ్రఫీ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు జీ రామకృష్ణారెడ్డి , డీ విజయ్ కుమార్, వీ కిరణ్ కుమార్, పీ అనంతరెడ్డి, ఎం దేవేందర్ ప్రసాద్ స్వర్ణ పతకాలు.. పీ పవన్, ఎన్ వెంకటరమణ, ఎం హరిప్రసాద్, కే శ్రీనివాస్, షేక్ ఖాదర్ షరీఫ్, సీహెచ్ సంతోష్, కే సతీశ్ రజత పతకాలు అందించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. పతక విజేతలకు అభినందనలు తెలిపారు. ఏఐపీడీ మీట్లో 12 ఏండ్ల తర్వాత ఓవరాల్ చాంపియన్గా నిలిచిన తెలంగాణ జట్టును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ పోలీస్ శాఖ చార్మినార్ ట్రోఫీ సహా 5 గోల్డ్, 7 సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకోవడం గొప్ప విషయమన్నారు. అసాధారణ ప్రతిభ కనబరిచిన తెలంగాణ పోలీసులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

