హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డ్రగ్స్ రవాణాపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ సరఫరాదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారిపై పోలీసులు నిఘా ఉంచి, వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గంజాయి సరఫరా కట్టడికి ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.