గ్లోబల్ సమ్మిట్‌కు సెలబ్రిటీలతో ప్రచారం
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సమ్మిట్, రక్షా ఎక్స్‌పోల సమాచారాన్ని విసృ్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆకర్షణీయమైన హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు.
- పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు: సీఎస్
హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సమ్మిట్, రక్షా ఎక్స్‌పోల సమాచారాన్ని విసృ్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆకర్షణీయమైన హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయస్థాయి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్‌మీడియా వేదికల ద్వారా సమ్మిట్‌కు విసృ్తత ప్రచారం కల్పించాలని తెలిపారు. సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల భాగస్వామ్యంతో ప్రత్యేక షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించి, సమ్మిట్ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రక్షా ఎక్స్పోను వీక్షించేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నదని, ఆ రోజు ప్రత్యేక కల్చరల్ కార్నివాల్ నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

