హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ఆదివారం సచివాలయంలో సమావేశమయ్యారు. సిలికాన్ ఫొటోనిక్స్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీధర్‌బాబు వివరించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్-2.0, పరిశోధన నుంచి వాణిజ్య తయారీ వరకు సమగ్ర ఏకోసిస్టమ్పై దృష్టి సారించామని తెలిపారు.
డిజైన్, రీసెర్చ్, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్‌పై ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. ఫొటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీకే సారస్వత్ తెలిపినట్టు వెల్లడించారు.