హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీ షెడ్యూల్ చేశారు. పాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31 నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, కొత్త షె డ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి మొదలుకానున్నాయి.
టీజీ పీజీఈసీ/టీజీ పీజీఈసెట్-2024 ప్రవేశాల రీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈ నెల 27 నుంచి 28 వరకు అ వకాశం కల్పించారు. ఈ నెల 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడ త సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్, కార్పొరేట్ సూళ్ల లో రెండో శనివారం సెలవు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్(టీపీటీఎల్ఎఫ్)తోపాటు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో డైరెక్టర్ ఆఫ్ సూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకు ఆ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. సా నుకూలంగా స్పందించిన ఆయన, డీ ఈవోలకు ఆర్డర్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు.
యాదగిరిగుట్ట, ఆగస్టు 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో అఖండ దీపారాధనకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధానాలయ మాడ వీధుల్లోని ఈశాన్య ప్రాంతంలో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. 32 ఫీట్ల పొ డవు, 28 ఫీట్ల వెడల్పుతో ప్రత్యేకమైన రేకులతో కూడిన షెడ్డు నిర్మిస్తున్నారు.