అన్నా, అన్నా.. మనకుగూడ
మంచి రోజులస్తున్నయే
బీజేపోళ్లు గెలిస్తే ఈ సారి
బీసీని సీఎం చేస్తరట
మన బీసీ నాయకుడు సీఎం
అయితే మన బీసీ బతుకులు బాగుపడతయే
కాషాయ పార్టీ మాటలు నమ్మిన
ఓ తమ్ముడు ఎగపోసుకుంటచ్చి
ఈ ముచ్చటను చెప్పిండు..
అరేయ్ తమ్మీ.. ఇన్ని రోజులు
దేశ ప్రధానిగా ఎవరున్నరు?
ఇంకెవరన్నా మన బీసీ నేత మోదీనే
మరి బీసీలు ఏమన్న బాగుపడ్డరా?
దేశంల బీసీలం 80 కోట్లున్నం
ఈ తొమ్మిదేండ్లళ్ల మన కోసం
ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనన్న ఏర్పాటు చేసిండ్రా?
దేశంల మన బలగమే 60 శాతంరా
చట్టసభల్ల రిజర్వేషన్లు ఇచ్చిన్రా..
పోనీ కేసీఆర్ సార్ లెక్క బీసీలకు
బీసీ బంధులాంటిది పెట్టిండ్రా?
మన కులవృత్తులోళ్లకన్నా ఏమన్న చేసిండ్రా?
గంతెందుకురా.. ఆళ్ల పార్టీలనే సూడు..
మొన్నటిదాకా ఆ పార్టీ అధ్యక్షుడు
బండి సంజయ్.. ఆయన బీసీ..
ఇప్పుడెవరున్నరు? కిషన్రెడ్డి!
ఎలచ్చన్లు లేనప్పుడు బీసీని అధ్యక్షుడిని చేసి
కరెక్ట్గ ఎలచ్చన్ల టైములనే
బీసీ నాయకుడికి ఢోకా ఇచ్చిన్రు
మరి గసోంటోళ్లు బీసీ సీఎంను చేసినా
ఢిల్లీల రిమోట్ ఒత్తితే ఇక్కడ కదిలే
ఆ బీసీ సీఎం మనకేమన్న చేత్తడా?
అందుకేరా తమ్మీ
బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ కాదు..
మన కడుపులకు రోజు ఐదు వేళ్లు పొయ్యేటట్టు..
మన బతుకులు ఆగంకాకుండా
ఆత్మగౌరవంతో బతికేటట్టు చేసినోళ్లే
ఆ సీఎం గద్దెమీద ఉండాలే
అప్పుడే మన ఓటుకు విలువ
-రాజు అతికం