2031-35 నాటికి పెరుగనున్న ఆయుర్దాయం
బాలుర కంటే బాలికల ఆయుష్షు 4 ఏండ్లు ఎక్కువ
నేషనల్ హెల్త్ ప్రొఫైల్ తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతున్నట్టు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ వెల్లడించింది. మరో పదేండ్ల తర్వాత సగటు ఆయుష్షు రెండేండ్లు పెరుగుతుందని ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొన్నది. పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారని స్పష్టం చేసింది. అయితే ఈ లెక్కలు పదేండ్ల తర్వాత పుట్టినవారికి మాత్రమే వర్తిస్తాయని, 2031-35 మధ్య పుట్టినవారు సగటున 73.5 ఏండ్లు బతుకుతారని చెప్పింది.
నివేదిక వివరాలు