TOSACON | విద్యానగర్, జనవరి 31: ఆర్థోపెడిక్ వైద్యుల 9వ రాష్ట్ర సదస్సును మొట్ట మొదటిసారిగా కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో నిర్వహిస్తున్నట్టు కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (కోసా) అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి తెలిపారు. గురువారం నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సు ఆర్థోపెడిక్ విద్యార్థులు, ఆర్థోపెడిక్ వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ వైద్య విధానంలో ఆధునిక పద్ధతుల ఆవిష్కరణలు, నూతన వైద్య విధానాలను వివరించనున్నట్టు చెప్పారు. రోబోటిక్ లైవ్ సర్జరీలు ఉంటాయని, సదస్సుకు దేశ విదేశాల నుంచి సీనియర్ వైద్యులు హాజరవుతారని తెలిపారు.