కరీంనగర్ కమాన్‌చౌరస్తా: కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో రోజైన శనివారం అట్టహాసంగా సాగాయి. ఈ వేడుకలో మంత్రి గంగులతోపాటు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్, జడ్పీ చైర్పర్సన్ విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.