హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఉచిత విద్యుత్తు పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని నాయీబ్రాహ్మణసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రజక, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం కింద ఇవ్వాల్సిన రూ.50 కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని పేర్కొన్నారు. బిల్లులు చెల్లించాలంటూ వృత్తిదారులను విద్యుత్తు అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.