హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 ( నమస్తే తెలంగాణ ) : తెలంగాణ ముదిరాజ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. విన్‌ఫ్లోరా హోటల్లో సోమవారం రాష్ట్ర సంఘం ఎన్నికల్లో కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటేశ్ (కొడంగల్ సీఐ, ఎక్సైజ్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీ జంగయ్య(సీఐ), ఉపాధ్యక్షులుగా పీ వెంకటయ్య (ఏసీ, వాణిజ్యశాఖ), ఎం సురేందర్(ఏఈ, విద్యుత్ శాఖ), వీ ధనరాజ్ (జేఏ, సీఐడీ), రాష్ట్ర కోశాధికారిగా ఆర్ మహేశ్వర్(ఎస్టీవో, ట్రెజరరీ శాఖ), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సురేశ్‌బాబు (సీఐ), కే విష్ణువర్దన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పీ శ్రీనివాస్(ఈఎస్ఐ వైద్యశాఖ), కే రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బీ వెంకటేశ్వర్లు, ఎస్ అశ్విని కుమార్, శివ, బీ ప్రసాద్, శ్రీరాము, కో-ఆర్డినేటర్‌గా టీ మహేశ్‌రాజ్ ఎన్నికయ్యారు.
రామగిరి, డిసెంబర్ 30 : నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర 6వ మహాసభల ముగింపు సందర్భంగా సోమవారం 2024-26 నూతన కమిటీనీ ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చావ రవి, ప్రధాన కార్యదర్శిగా వెంకట్, ఉపాధ్యక్షులుగా జంగయ్య, దుర్గాభవాని, కోశాధికారిగా లక్ష్మారెడ్డి, కార్యదర్శులుగా రాములు, సోమశేఖర్, రాజశేఖర్‌రెడ్డి, శాంతికుమారి, సమ్మారావు, సత్యానంద్, నాగమణి, రాజు, రంజిత్‌కుమార్, రవిప్రకాశ్‌గౌడ్, మల్లారెడ్డి, రవికుమార్, శ్రీధర్, సింహాచలం, జ్ఞానమంజరి, వెంకటప్ప, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా జాకటి యాకయ్య, సభ్యులుగా లక్ష్మణరావు, శ్రీనివాసరావు, రఘుపాల్, శంకర్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్ ఎన్నికయ్యారు. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రతిక ప్రధాన సంపాదకుడిగా పాపన్నగారి మాణిక్‌రెడ్డి, కుటుంబ సంక్షేమనిధి చైర్మన్‌గా రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సిలివేరు అనిల్‌కుమార్, కోశాధికారిగా సైదులును నియమించారు. ఎన్నికల అధికారిగా మస్తాన్‌రావు, పరిశీలకుడిగా కిష్టయ్య వ్యహరించారు.