నల్లగొండ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచే విధంగా అడ్డగోలుగా వంట గ్యాస్ ధరలను పెంచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి (Minister Jagadish Reddy) ఆరోపించారు. తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన రూ. 19లక్షల కోట్లను గుజరాత్ రాష్ట్రానికి మళ్లించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Minister KTR) పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో మహిళలతో కలిసి భారీ నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధరలు ఏనాడు కూడా వంద డాలర్లకు మించలేదని అయిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశనంటాయని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ వంచన చేరాడని విమర్శించారు. గుజరాత్లో జరిగిన ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపించారు. దేశం యావత్ బీఆర్ఎస్ (BRS) వైపే దృష్టిని సారించిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోనే దారిద్ర్య నిర్మూలన సాధ్యమని అన్నారు. నల్లగొండలో శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.