హైదరాబాద్ : క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ (52) హఠాన్మరణం పట్ల రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం యావత్ క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు అని మంత్రి అన్నారు. ఎంతో మంది వర్ధమాన క్రికెట్ క్రీడాకారులకు వార్న్ స్ఫూర్తిగా నిలిచారన్నారు. స్పిన్ బౌలర్గా ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో స్ఫూర్తివంతమైన విజయాలను అందించారన్నారు. క్రికెట్కు షేన్ వార్న్ చేసిన సేవలను మంత్రి ఈసందర్భంగా స్మరించుకున్నారు. వార్న్ తన క్రీడా జీవితంలో 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారని.. టెస్టుల్లో 5 వికెట్లు 37 సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీసి అనితర సాధ్యుడిగా నిలిచారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.