హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శుక్రవారం 27 ప్రశ్నలను సంధించిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. తన ప్రశ్నలకు సమాధానాలేవని అమిత్ షాను నిలదీశారు. శనివారం ట్విట్టర్లో ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు.. మీరు ఈ రోజు తెలంగాణను సందర్శిస్తున్నందున మా రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష, ప్రతీకార వైఖరిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నా. కింద నా ప్రశ్నపత్రం ఉంది. వాటికి మీరిచ్చే సమాధానాలతో జ్ఞానోదయం పొందాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.