అభివృద్ధి కి 35 ఏండ్లు చాలదా : జానారెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి సూటి ప్రశ్న
మంత్రి జగదీశ్ రెడ్డి | ఏడు సార్లు గెలిపిస్తే 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 14 ఏండ్లు మంత్రిగా ఉన్నప్పటికీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి 35 సంవత్సరాలు సరిపోదా అని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు ఏడు సార్లు గెలిపిస్తే 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 14 ఏండ్లు మంత్రిగా ఉన్నప్పటికీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. అధికారం కోల్పోయాక జానారెడ్డికి అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి సోమవారం రాత్రి అనుమల మండలం మదారిగూడెం, పేరూరు తదితర గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నిర్మించి ఎంతోకాలమైనా . దానిని అనుకుని ఉన్న నెల్లికల్లుకు ఎందుకు నీళ్లు అందించలేకపోయారో నియోజకవర్గ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో 18 ఏండ్ల క్రితం మొదలు పెట్టిన లో లెవల్ కెనాల్ నిర్మాణం పనుల్లో పురోగతి కేవలం 10 శాతానికి మించలేదని తెలిపారు. అదే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేండ్ల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి కెనాల్ పనులను పూర్తి చేశారని గుర్తు చేశారు. ఏం అభివృద్ధి చేశారని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ.. తనను ఆదరించి అక్కున చేర్చుకుంటే అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్
సాగర్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం: మంత్రి తలసాని
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

