సిద్దిపేట, డిసెంబర్ 25: కేంద్ర ప్రభుత్వ విధానాలతో మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. మార్కెట్లను రద్దుచేసేలా నల్ల చట్టాలు తెచ్చిందని, రైతుల పోరాటంతోవెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. యాసంగిలో పండే ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రులకు పనిలేదని కేంద్ర మంత్రి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మంత్రులు పనిలేకవచ్చారని చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. శనివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ నూతన భవన, గోదాము నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్‌లో ఫిష్స్టాల్, మార్కెట్ యార్డ్‌లో వర్మీ కంపోస్ట్ షెడ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు కోట్లతెలంగాణ ప్రజల భవిష్యత్తు.. 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసమే తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు.
కొనట్లేదని.., గత అరవై ఏండ్లుగా ప్రభుత్వాలన్నీ కూడా ధాన్యం కొన్నాయని గుర్తుచేశారు. ఎప్పటిలాగానే ఇప్పుడూ కొనాలని డిమాండ్‌చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం బాధ్యతేనని స్పష్టంచేశారు.రైతుల ధాన్యం కొనుగోలులోనూ లాబనష్టాలను బేరీజు వేస్తున్న కేంద్రంతీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని రైతులు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున తాము రైతులకు 24 గంటల ఉచితవిద్యుత్తు, పంట పెట్టుబడి కోసం రైతుబంధు, సకాలంలో విత్తనాలను అందిస్తున్నామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలోమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవ్, రైతుబంధుసమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి పాల్గొన్నారు.