హైదరాబాద్, ఆగస్టు13 (నమస్తే తెలంగాణ): కోడిగుడ్ల సరఫరాలో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందనేది అబద్ధమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా కలగలిపి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జిల్లావ్యాప్తంగా ఏకరీతి రేటు విధానం అమలు, గురుకుల విద్యార్థులకు పోషకాహారం, పరిశుభ్రమైన భోజనం, ఫుడ్ పాయిజన్ ఘటనల నివారణ, మండల మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు అవకాశాలు కల్పించడం, జిల్లాలోని బహుళ విద్యాసంస్థలకు ఒకే ఏజెన్సీ టెండర్ వేసే సౌకర్యం కల్పించడమే జీవో-17 లక్ష్యమని స్పష్టంచేశారు.