హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్ చౌరస్తా ఇకపై శ్రీకాంతాచారి జంక్షన్‌గా మారనున్నది. మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు పెడుతున్నట్టు ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 54ను జారీ చేసింది. ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ వంతెనకు మాల్ మైసమ్మ పేరు పెడుతూ జీవో 53ను జారీ చేసింది. బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలుపనున్నది.