రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాడ్కోల్ వాసి మృతి?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లు సమాచారం రావడంతో అతడి కుటుంబం ఆందోళన చెందుతున్నది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఏజెంట్ మోసం వల్ల రష్యాలో చిక్కుకుపోయారు. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా అక్కడి ప్రభుత్వం వీరిని బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నది.
- డ్రోన్ దాడిలో చనిపోయినట్లు స్నేహితుడి వాయిస్ మెసేజ్
- ఆందోళనలో కుటుంబ సభ్యులు
బాన్సువాడ రూరల్, అక్టోబర్ 12: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లు సమాచారం రావడంతో అతడి కుటుంబం ఆందోళన చెందుతున్నది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఏజెంట్ మోసం వల్ల రష్యాలో చిక్కుకుపోయారు. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా అక్కడి ప్రభుత్వం వీరిని బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నది.
ఈ నలుగురిలో ఒకరైన తాడ్కోల్ వాసి మహమ్మద్ అఫ్జల్ఖాన్ (43) మృతి చెందాడనే వార్త స్థానికంగా కలకలం రేపుతున్నది. రష్యాలోని అడవుల్లో చిక్కుకున్న వారిలో ఒకరైన సిర్సు అశోక్ తన భార్యకు పంపిన వాయిస్ మెసేజ్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో అఫ్జల్ఖాన్ మృతి చెంది పది రోజులవుతున్నదని వాయిస్ మెసేజ్‌లో తెలిపాడు. తమతో కలిపి మొత్తం 50 మంది వస్తే 48 మంది చనిపోయారని, ఇద్దరం మాత్రమే గాయాలతో పారిపోతుండగా, సైనికులు పట్టుకుని బేడీలు వేసి కట్టేశారని పేర్కొన్నాడు.
మరోవైపు, అఫ్జల్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు అతడు మృతి చెందాడా.. లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు తండ్రి అబ్బాస్‌ఖాన్, భార్య అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. జిల్లా ఎస్పీకి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లామని, ఎలాంటి సమాచారం అందడం లేదని అబ్బాస్‌ఖాన్ వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

