జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 1 : జగిత్యాల జిల్లావాసి ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడిలో మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్కు చెందిన వావిలాల సుదర్శన్ (42) జీవనోపాధి కోసం 4 నెలల క్రితం కన్స్ట్రక్షన్ వర్పై ఉక్రెయిన్ వెళ్లాడు. సోమవారం రాత్రి సుదర్శన్ రూమ్లో ఉండగా అకస్మాత్తుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన సైరన్ వచ్చింది. దీంతో సుదర్శన్ బయటకు వచ్చే సమయంలో మిస్సైల్ తాకడంతో అకడికకడే మృతి చెందాడు. మృతుడికి భార్య భార్గవి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జీవనోపాధికోసం విదేశాల బాట పట్టిన సుదర్శన్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.