న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల నాన్ మెడికల్ విభాగం నుంచి ఎయిర్ వైస్ మార్షల్ ర్యాంకును సాధించిన తొలి మహిళా అధికారిగా ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆమె ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)గా బాధ్యతలు స్వీకరించారు. 1994 జూన్ 18న ఈ విభాగంలో చేరిన శక్తి శర్మ తన కెరీర్లో అత్యధిక భాగాన్ని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎడ్యుకేషన్ బ్రాంచిలలోనే గడిపారు. కొన్నేండ్లుగా ఆమె వివిధ శిక్షణా సంస్థలు, ఎయిర్ స్టేషన్లు, కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో సేవలు అందించారు. విద్యా విభాగాన్ని బలోపేతం చేయడం, సాయుధ దళాలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని పెంపొందించడంపై ఆమె ప్రధానంగా దృష్టి సారించారు.