న్యూఢిల్లీ: సముద్ర మట్టాలు పెరుతున్న కారణంగా భారతదేశంలోని కోల్కతా, ముంబై నగరాలలో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘సముద్ర మట్టాల పెరుగుదలకు సంబంధించిన సవాళ్లు, దానిని పరిష్కరించే మారా ్గలు, విధానాలు’ అనే
శీర్షికతో ఐరాస జనరల్ సెక్రటరీ విడుదల చేసిన నివేదిక ప్రకారం సముద్ర మట్టాల పెరుగుదల ఇకపై సుదూర ముప్పు కాదని, చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా ఇప్పుడు జరుగుతోందని స్పష్టమవుతున్నది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటికీ ఇది పెను సవాలుగా మారింది.