న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు నెలలో 24.51 బిలియన్ల లావాదేవీలు జరుగగా, వీటి విలువ రూ.29.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
రక్షా బంధన్ కారణంగా దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభం కావడం వల్లనే యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని పేర్కొంది. విలువపరంగా చూస్తే వరుస నెలల్లో నమోదైన దాంతో పోలిస్తే తగ్గాయి. మే నెలలో రూ.29.8 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగగా, జూలై నెలలో రూ.29.9 లక్షల కోట్లుగా ఉన్నాయి.