ఫైనల్‌కు ఈస్ట్ జోన్.. మెరిసిన షమీ, వైభవ్, ఇషాన్
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ ఫైనల్ చేరింది. మంగళవారం ముగిసిన సెమీస్‌లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్.. 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌ను ఓడించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ ఫైనల్ చేరింది. మంగళవారం ముగిసిన సెమీస్‌లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్.. 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌ను ఓడించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ స్కోర్లు (266) సమమవగా మూడు రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సెంట్రల్.. 158 పరుగులకే ఆలౌట్ అయింది. ముకేశ్ కుమార్ (4/44), వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (3/56) ధాటికి సెంట్రల్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. అమన్ మొఖాడె (41) టాప్ స్కోరర్. 159 పరుగుల స్వల్ప ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40)తో పాటు కెప్టెన్ ఇషాన్ (39 నాటౌట్) రాణించడంతో ఈస్ట్ జోన్ 4 వికెట్లు మిగిలుండగానే విజయం అందుకుంది.
నార్త్ జోన్‌కు ఆధిక్యం
సౌత్ జోన్, నార్త్ జోన్ మధ్య మరో సెమీస్ రసవత్తరంగా సాగుతున్నది. 112 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తర్వాత సౌత్ 312 స్కోరు వద్ద ఆలౌటైంది.తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన నార్త్.. మూడో రోజు ఆట నిలిచే సమయానికి 7 వికెట్ల నష్టపోయి 256 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 139 పరుగుల ఆధిక్యంలో ఉంది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఆట చివరిరోజైన బుధవారం విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

