Junior Doctors | హామీలిచ్చి అమలు చేయని ప్రభుత్వం.. నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
- ఈ నెల 19నే ప్రభుత్వానికి సమ్మె నోటీసు
- నాలుగు రోజులుగా వరుసగా నిరసనలు
- అయినా పట్టించుకోని ఆరోగ్యశాఖ మంత్రి
Junior Doctors | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నది. దాదాపు 4 వేల మంది సమ్మెలో పాల్గొంటారని చెప్తున్నారు. ఈ నిర్ణయంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు వంటివాటికి అంతరాయం కలగనున్నది. తమ సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే నిరవధిక సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు. వాస్తవానికి జూనియర్ డాక్టర్లు గత డిసెంబర్ నుంచే ప్రభుత్వానికి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. సమ్మె నోటీసులు ఇస్తున్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారుల హామీలు నమ్మి సమ్మెను విరమిస్తున్నారు. గత నెల 20న కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వటంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవటంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు, డ్రెస్ వేసుకొని విధులకు హాజరుకావటం వంటివి చేపట్టారు. ఆదివారం కండ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పట్టించుకోలేదు. దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.
హామీ ఇచ్చి మరిచిన మంత్రి
జూనియర్ డాక్టర్లు గత ఏడాది డిసెంబర్లో ఇవే డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చారు. డిసెంబర్ 19న మంత్రి దామోదర రాజనర్సింహా వారితో చర్చలు జరిపారు. ప్రతి నెల 15వ తేదీలోగా ైస్టెపెండ్ విడుదల చేస్తామని, పెరిగిన సీట్లకు అనుగుణంగా హాస్టల్ సదుపాయం కల్పిస్తామని, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు వేస్తామని, రెండు నెలల్లో ఉస్మానియా దవాఖాన కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. జూనియర్ డాక్టర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. దీంతో వారు సమ్మెను విరమించారు. అయితే.. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మంత్రి ఇచ్చిన హామీలు నెరవేరలేదని జూడాలు వాపోతున్నారు. మొదట మంత్రి తమతో చర్చలు జరిపారని, గత నెలలో ఉన్నతాధికారులు పిలిపించుకొని మాట్లాడారని, ఈసారి కనీసం ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సమ్మెకు వెళ్తున్నట్టు వెల్లడించారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లు ఇవే..
- ప్రతి నెల 10వ తేదీలోగా ైస్టెపెండ్ జమచేసేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలి.
- సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెండ్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలి.
- పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలి.
- ప్రభుత్వ దవాఖానల్లో భద్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పోలీసులతో భద్రత కల్పించాలి.
- హాస్టల్ భవనాలను నిర్మించకపోవటంతో పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలి.
- ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలి.
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి.
- కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో అంతర్గత రోడ్లు వేయాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

