KTR | రేవంత్ దృష్టిలో సోనియాగాంధీ అప్పుడు బలిదేవత.. ఇప్పుడు కాళికామాత: మంత్రి కేటీఆర్
KTR | తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు వాళ్లను పొగుడుతున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు.
కామారెడ్డి: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు వాళ్లను పొగుడుతున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు.
మంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీల ఉన్నప్పుడు సోనియాగాంధీని బలిదేవత అన్నడు. రాహుల్‌గాంధీని ఉత్త పప్పు కాదు, ముద్దపప్పు అన్నడు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీల జొచ్చిండు. కాంగ్రెస్‌లోకి వచ్చినంక బలిదేవత సోనియాగాంధీ రేవంత్‌రెడ్డికి కాలికామాత లెక్క కనపడ్తున్నది. ముద్ద పప్పు రాహుల్‌గాంధీ నిప్పు లెక్క కనపడ్తున్నడు. ఇదిట్టుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దొరలకు, ప్రజలకు మధ్య పోరాటం అని రాహుల్‌గాంధీ అంటున్నడు. రాహుల్‌గాంధీ చెప్పింది నిజమే. ఇక్కడ ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం జరుగుతున్నది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
‘రాహుల్‌గాంధీ లీడర్ కాదు, రీడర్. ఏదీ రాసిస్తే అది సదువుతడు, పోతడు. ఆయనకు తెలియని విషయం ఏందంటే ఢిల్లీ దొరలతో పోరాటం తెలంగాణ ప్రజలకు కొత్తకాదు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 ఏళ్లు తెలంగాణ ప్రజలు ఢిల్లీతో పోరాడిండ్రు. రగులుతున్న తెలంగాణ ఉద్యమంపై అడుగడుగునా నీళ్లు పోసింది రాహుల్‌గాంధీ నాయినమ్మ ఇందిరాగాంధీనే. దేశంలో ఎమర్జెన్సీ విధించిన నియంత కూడా రాహుల్‌గాంధీ నాయనమ్మనే. తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మందిని బలితీసుకున్నది రాహుల్‌గాంధీ తల్లి సోనియమ్మ. నాడు రాహుల్‌గాంధీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ మొదలు ఇప్పుడు నరేంద్రమోదీ వరకు సుదీర్ఘంగా తెలంగాణ ప్రజలు ఢిల్లీ దొరల మీద కొట్లాడుతనే ఉన్నరు’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

