హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 221 పని రోజులతో విద్యా సంవత్సరాన్ని ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. జూలై 1న ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 15న రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. అక్టోబర్ 2 నుంచి 9 వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు, 2023, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది.
ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6వ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయని, 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు వివరించింది.