హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలోని పదెకరాల స్థలాన్ని జేఎన్ఎఫ్ఏయూకు కేటాయించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కోదండరాం సహా మాజీ వీసీలు, పాత్రికేయులు, బుద్ధిజీవులు సంయుక్తంగా బహిరంగ లేఖను రాశారు.
ప్రజాపాలనకు హామీ ఇచ్చి, అంబేదర్ యూనివర్సిటీ స్థలాన్ని ఇతర సంస్థలకు కేటాయించడం సరికాదని హితవు పలికారు. లేఖ రాసిన వారిలో వీఎస్ ప్రసాద్, హరగోపాల్, కోదండరాం, నాగేశ్వర్, సీతారామారావు, నర్సింహారెడ్డి, ఘంటా చక్రపాణి, వాయునందన్, లింగమూర్తి, వెంకయ్య, కాత్యాయని విద్మహే, పద్మజాషా, ఉస్మానియా, కాకతీయ, తెలుగు, సీఫెల్, సెంట్రల్ , మౌలానా ఉర్దూ యూనివర్సిటీ సహా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తి తదితరులు ఉన్నారు.