హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని(టీజీఐఎల్పీ) ప్రారంభిస్తున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ సెక్రటరీ స్మ్రితిశరణ్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, బ్రాక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో శనివారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండేండ్లపాటు అత్యంత వెనుకబడిన 6వేల కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించనున్నట్టు చెప్పారు.
ఎంవోడబ్ల్యూవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో సెర్ప్ ద్వారా హిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. శిక్షణకు సంబంధించిన పోస్టర్ను శనివారం సచివాలయంలో ఆమె ఆవిష్కరించారు.