దేశానికే దిక్సూచి

- కరోనా కట్టడిలో ఆదర్శంగా తెలంగాణ విధానాలు
- రాష్ట్రంలో మొదలైన ఇంటింటి సర్వే ఇప్పుడు దేశవ్యాప్తం
- ప్రతి గ్రామంలో ఇంటింటి ఆరోగ్య సర్వేకు కేంద్రం ఆదేశం
- స్వల్ప లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్ అందజేయాలి
- అన్ని పీహెచ్‌సీల్లోనూ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలి
- మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
పాలకుడికి ముందుచూపు ఉండాలి.. ప్రజల రేపటి అవసరాలు ఎలా ఉంటాయో ఇవాళే కనిపెట్టాలి.. భవిష్యత్తు విపత్తులను వర్తమానంలోనే గుర్తించాలి. అంతకు మించి ప్రజలందరికీ మంచి చేయాలన్న సంకల్పం ఉండాలి. తెలంగాణలో ఇప్పుడు అదే సంకల్పం కొనసాగుతున్నది. అన్నిరంగాల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ఇప్పుడు కరోనా నియంత్రణలోనూ దేశానికి దారి చూపుతున్నది. కొవిడ్ కట్టడిలో తెలంగాణ ఇప్పటికే అనుసరిస్తున్న పలు విధానాలను దేశమంతా చేపట్టాలని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో రాష్ర్టాలకు సూచించింది.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు కొవిడ్ కట్టడిలోనూ దిక్సూచిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఈ నెల 4 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. కరోనాను ముందుగానే గుర్తించి, కట్టడిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 27 వేల ఆరోగ్య బృందాలు ఇంటింటికీ తిరిగి ప్రజలందరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నాయి. జ్వరం, జలుబులాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడికల్ కిట్ ఇచ్చి, వారు ఇంటినుంచి బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నాయి. కోటికిపైగా కుటుంబాలున్న రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 75 లక్షల కుటుంబాలను వైద్య బృందాలు స్వయంగా కలిశాయి. దాంతో రాష్ట్రంలో కొవిడ్ కేసులు వేగంగా తగ్గుతున్నాయి. ఇదే విధానాన్ని అనుసరిస్తూ సర్వేలో స్వల్ప లక్షణాలు ఉన్నవారికి ప్రాథమిక మెడికల్ కిట్‌ను అందజేయాలని కేంద్రం పేర్కొన్నది.
తెలంగాణలో చేస్తున్నదే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా..
కరోనా కట్టడిపై ఇటీవల అన్ని రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే గురించి కూలంకషంగా వివరించారు. లక్షణాలున్నవారికి ఇస్తున్న కిట్లు, వాళ్ల ఆరోగ్యంపై మానిటరింగ్ చేస్తున్న విధానం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న తీరు, ఇప్పటివరకు సర్వేచేసిన ఇండ్ల సంఖ్య, సర్వేతో వస్తున్న ఫలితాలను సమీక్షలో హరీశ్‌రావు విపులంగా వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చిన హర్షవర్ధన్, సీఎం కేసీఆర్ మీ ద్వారా చేసిన సూచనలు, సలహాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని సమీక్షలోనే చెప్పారు. హరీశ్‌రావు సర్వే గురించి చెప్పిన ప్రతి విషయాన్ని స్వయంగా నోట్ చేసుకొని ప్రధానికి వివరించారు. వెంటనే కోర్‌కమిటీతో సమావేశమైన మోదీ, కరోనా కట్టడికి తెలంగాణలో అమలుచేస్తున్న విధానాలు బాగున్నాయని, దేశవ్యాప్తంగా వాటినే అమలుచేయాలని అన్ని రాష్ర్టాలను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఆరోగ్య సర్వేతోపాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ తెలంగాణలో నిర్వహిస్తున్నట్టే యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం పేర్కొన్నది. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి ప్రాథమిక కాంటాక్ట్‌లను ఆశ వర్కర్ల ద్వారా గుర్తించాలన్న కేంద్రం మార్గదర్శకం కూడా తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్నది. లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని తెలంగాణలో ఇంట్లోనే ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని పేర్కొనడం విశేషం. దీంతో తెలంగాణ దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. మనం అమలు చేస్తున్న వాటినే ఇతర రాష్ర్టాలు అనుసరించాలని చెప్పడం.. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం అన్నిరాష్ర్టాలకంటే ముందుందని కేంద్రం చెప్పకనే చెప్పినైట్టెంది.
ఇవే మార్గదర్శకాలు..
- గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ వైద్య సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు కొవిడ్-19ను కట్టడి చేసేందుకు ఈ చర్యలు (ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్నవి) తీసుకోవాలని కేంద్ర సూచించింది.
- ప్రతి గ్రామంలో ఆరోగ్య సర్వే నిర్వహించాలి. ఆశ కార్యకర్తలు, గ్రామ హెల్త్ శానిటేషన్, న్యూట్రిషన్ కమిటీల ద్వారా ఆరోగ్య వివరాలు సేకరించాలి. అనారోగ్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోస సమస్యలు ఉన్నవారిని గుర్తించాలి. అన్నింటికంటే ముఖ్యంగా కరోనా లక్షణాలున్నవారిని గ్రామ స్థాయిలోనే గుర్తించి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా టెలి కన్సల్టేషన్ ఇప్పించాలి. ఇబ్బందికర పరిస్థితులు, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నవారిని వెంటనే పెద్ద ఆరోగ్య కేంద్రాలకు పంపించాలి. అనారోగ్య సమస్యలు, తీవ్ర శ్వాసకోస సమస్యలు ఉన్నవారి కోసం ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక స్లాట్స్ కేటాయించి సేవలు అందించాలి.
- కరోనా లక్షణాలున్నవారికి పారాసిటిమల్ ట్యాబ్లెట్స్, ఇవర్మెటాసిన్, కాఫ్ సిరప్, మల్టీ విటమిన్స్ ట్యాబ్లెట్స్‌తో కూడి హోం ఐసొలేషన్ కిట్లు అందజేయాలి. రోగి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మెడిసిన్ వినియోగించాలి? లక్షణాలు తీవ్రమైతే ఎవరిని సంప్రదించాలన్న వివరాలతో కూడిన కరపత్రాన్ని అందజేయాలి.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ రేట్ 94 శాతం కంటే తక్కువగా ఉండి, మానసిక అస్థిరత వంటి లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఆక్సిజన్ రేట్ 94 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి ఆక్సిజన్ బెడ్ రిఫర్ చేయాలి.
- కనీసం 30 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

