KCR | తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి: కేసీఆర్
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొనియాడారు.
- తెలంగాణ పోరాటంలో దాశరథి స్ఫూర్తి
- దాశరథి శతజయంతి సందర్భంగా కేసీఆర్
KCR | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. క్కా
తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి రచయిత, దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు. మహోన్నతమైన దాశరథి గొప్పతనాన్ని గుర్తించి, ఆయన స్ఫూర్తి కొనసాగే దిశగా, వారి జయంతి రోజున, తెలంగాణ సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులకు ప్రతియేటా అందించేందుకు ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను తమ ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యస్ఫూర్తిదాయకమని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

