హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మెడికోలకు అందించే స్టైపెండ్‌ను ప్రభుత్వం 15% పెంచింది. హౌజ్ సర్జన్లు, పీజీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైపెండ్‌ను పెంచు తూ జీవో-90 జారీచేసింది. హౌజ్సర్జన్ల స్టైపెండ్‌ను రూ.25,906 నుంచి రూ. 29,792కు, సీనియర్ రెసిడెంట్ల స్టైపెండ్‌ను రూ.92,575 నుంచి రూ.1,06,461కు పెంచింది.
ఈ ఉత్తర్వులను జనవరి 1 నుంచే అమ లు చేయనున్నట్టు పేర్కొన్నది. స్టైపెండ్ పెంపుదలపై తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ హర్షం వ్యక్తంచేసింది. సమ్మెకు వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(టీ జుడా)ప్రకటించింది.