హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. ఈ సమావేశంలో యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం విధివిధానాలు రూపొందించనున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించనున్నారు.